calender_icon.png 21 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధార్థ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

21-09-2025 07:37:26 PM

చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి మండల కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాల(Siddhartha School)లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సిద్ధార్థ పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వప్న గౌరీదేవి అమ్మవారిని పూజ చేసినా అనంతరం పిల్లలు తల్లిదండ్రులు తీసుకువచ్చిన బతుకమ్మలను గౌరీ దేవి అమ్మవారి దగ్గర పెట్టి బతుకమ్మ సంబరాలను చేసుకున్నారు. అనంతరం చైర్మన్ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణలలో అనేక సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తొమ్మిది రోజులు జరుపుకునే పండుగని కొని ఆడారు అన్ని పూలతో పేర్చుకొని  తెలంగాణలో జరుపుకునే ఘనమైన పండుగ సద్దుల బతుకమ్మ అన్నారు. ప్రతి ఇంటా తొమ్మిది రోజులు ఒక యజ్ఞం లాగా అమ్మవార్లను కొలుచుకుంటారని అన్నారు. అనంతరం పాఠశాలలో ఆటపాటలతోటి ఘనంగా బతుకమ్మ సంబరాలను పిల్లలు పిల్లల తల్లిదండ్రులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.