21-09-2025 07:29:41 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): దసరా ఉత్సవాల్లో భాగంగా చింతకుంటలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద మొట్టమొదటిసారి రామ్ లీలా ఉత్సవాలను వచ్చే నెల రెండో తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించడానికి మంజునాథ యూత్ ఫ్రెండ్స్, గుర్రాల జయప్రకాశ్ రెడ్డి(జె. పి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల ఆదివారం రోజున ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించనుకునే పండుగ దసరా పండుగని ఈ పండుగకు చింతకుంట గ్రామంలో మొదటిసారి రామ్ లీలా ఉత్సవాల నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యమానికి ప్రజలు వచ్చి విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ కొత్తపల్లి మండల వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, బి ఆర్ ఎస్ నాయకులు బెజ్జంకి సంపత్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు మణికంఠ గౌడ్, నాయకులు కమల్ గౌడ్, మణి గౌడ్, తదితరులు ,పాల్గొన్నారు.