టిఎస్ ఎడ్‌సెట్‌కు 87 శాతం మంది హాజరు
హైదరాబాద్: బిఈడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టిఎస్ ఎడ్‌సెట్-2024 ప్రవేశ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృనాళిని తల్లా పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా రెండు విడుతలుగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 79 సెంటర్లలో పరీక్షను నిర్వహించినట్లు ఆమె తెలిపారు. టిఎస్ ఎడ్‌సెట్-2024 ప్రవేశ పరీక్ష కోసం మొత్తం 33,879 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి సెషన్‌లో 16,321 మందికి 14,633 (86 శాతం) మంది హాజరయ్యారు. రెండో సెషన్‌లో 16,950 మంది విద్యార్థుకు గానూ 14,830 (87 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. రెండు సెషన్లు కలుపి మొత్తం 29,463 (87 శాతం) మంది పరీక్ష రాసినట్లు ఆమె పేర్కొన్నారు. తొలి సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు.






