5 July, 2026 | 10:42 AM

నేడు ఎడ్‌సెట్ ఎంట్రెన్స్

23-05-2024 01:43 AM

హాజరుకానున్న 33,879 మంది అభ్యర్థులు

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): బీఎడ్ కోర్సులో చేరేందుకు నిర్వహించే ఎడ్‌సెట్ పరీక్ష గురువారం జరగనుంది. రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు హజరుకానున్నారు. సెషన్ 16,929 మంది, సెషన్ 16,950 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 79 సెంటర్లను ఏర్పాటు చేశారు.  

24న పాలీసెట్ పరీక్ష

24న రాష్ట్రవ్యాప్తంగా పాలీటెక్నిక్ ఎంట్రెన్స్ (పాలీసెట్) పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరగనుంది. మూడేళ్ల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా అడ్మిషన్లు చేపడుతారు. ఈ పరీక్షకు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు మొత్తం 92,808 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 259 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.