calender_icon.png 28 June, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి అదృశ్యం

28-06-2025 01:02:02 AM

ఘట్ కేసర్, జూన్ 27 : ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన వాగేటి మల్లారెడ్డి కుమారుడు వాగేటి దినేష్ రెడ్డి (14) 9వతరగతి చదువుతున్నాడు.

ఈనెల 25న తండ్రి మల్లారెడ్డి తన కుమారుడు దినేష్ రెడ్డిని బాగా చదువుకోవాలని మందలించి ఉదయం 9 గంటలకు రోజువారీ పనికి వెళ్లాడు. తప్పిపోయిన బాలుడు తన తల్లికి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లాడు. వెంటనే ఆమె తన భర్తకు సమాచారం ఇచ్చింది.

ఆందోళనకు గురైన వారు చుట్టుపక్కల ప్రాంతాలు, బందు మిత్రుల వద్ద ఆరా తీసిన ఫలితం లేకపోవడంతో ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన వ్యక్తి ఎత్తు 5 అడుగులు, నార్మల్ కలర్, ధరించిన దుస్తులు బూడిద రంగు టీ-షర్ట్, ఎరుపు రంగు నైట్ ఫ్యాంట్ వేసుకుని ఉన్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.