14 July, 2026 | 6:57 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

మంథనిలో పీజీ కళాశాల, శ్రీపాద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయండి

27-05-2025 12:52 PM

మంథని,(విజయక్రాంతి): మంథనిలో పీజీ కళాశాల, శ్రీపాద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కృషి చేయాలని మంథని విద్యార్థి సంఘం నాయకుడు బెజ్జంకి డిగంబర్ మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా డిగంబర్ మాట్లాడుతూ... మంథని పట్టణంలోని విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ ప్రాంతంలో పీజీ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండేలా శ్రీపాద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్(Sripada Institute of Medical College) ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో అందజేశారు. మంథని ప్రాంతం విద్యావంతులకు వేదికైన ప్రాంతం అన్నారు. మంత్రి  స్పందిస్తూ పీజీ కళాశాల కోసం కృషి చేస్తానని, మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తానని డిగంబర్ కు హామీ ఇచ్చారు. మంత్రికి డిగంబర్ కృతజ్ఞతలు తెలిపారు.