calender_icon.png 6 May, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమిత ప్రసాదరావు ప్రోత్సాహంతో 550 మార్కులు సాధించిన విద్యార్థి

06-05-2025 12:00:00 AM

కరీంనగర్, మే 5 (విజయ క్రాంతి): పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్ట ర్ ఇ ప్రసాదరావు ప్రోత్సాహంతో విద్యాసంస్థలో 28 సంవత్సరాలుగా డీటీపీ ఆపరేటర్ గా పనిచేస్తున్న పల్లెర్ల రాజు కుమారుడు శశాంక్ పదవ తరగతిలో 550 మార్కులు సాధించాడు.

విద్యార్ధి శశాంక్ ను ప్రసాదరావు, డైరెక్టర్ అనూకర్ రావులు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్ధి మాట్లాడుతూ ప్రసాదరావు ప్రోత్సాహం, ప్రేరణతో మంచి మార్కులు సాధించానని తెలిపారు. నాకు, మా అన్నయ్యకు ఉచిత విద్యను అందించినందుకు మేము రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.