06-05-2025 12:00:00 AM
జుక్కల్, మే 5 : అధికారులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఇసుక మాత్రం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా, అక్రమంగా ఇసుక ను రవాణా చేస్తూనే ఉన్నారు. వీరికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో (అనధికారికంగా) కొందరు ప్రైవేటు వ్యక్తులు ట్రాక్టర్ల యజమానుల నుంచి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నట్లు కూడా సమాచారం.
ప్రభుత్వ అనుమతుల పేరిట ఈ తంతు రోజు జరుగుతూనే ఉంది. మధ్యాహ్నం ఉంటే అంతే సంగతులు అనే విధంగా మారింది. ప్రతిరోజు ఉదయం పూట జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ చౌరస్తా మీదుగా కర్ణాటక కు రెండు ఇసుక టిప్పర్లు ప్రతిరోజు వెళ్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. రెవిన్యూ కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంతో వారి మీద నిఘా కూడా కరువైందన్నట్లు తెలుస్తోంది.
ఎలాంటి అనుమతులు లేకుండా ఎటు మహారాష్ట్రకు అటు కర్ణాటక కు తరలిస్తున్న వైనం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాత్రి వేళల్లో ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. డాక్టర్లకు అడ్డుగా ఎవరైనా వెరైటీ వారిపై డాక్టర్లు ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సమాచారం.
ఇంత దారుణానికి ఓడిగడుతున్న ట్రాక్టర్లు టిప్పర్ల యజమానుల పట్ల పోలీసులు సంబంధిత రెవెన్యూ అధికారులు గా ఏర్పాటు చేసి వారిని కఠిన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజుల క్రితమే బిచ్కుంద మండలంలో అధికారులు 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు.
అయినప్పటికీ అక్రమార్కులు పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఇసుక దందాను ఆపడం లేదంటూ పలువురు చర్చించుకుంటున్నారు. బిచ్కుంద నుంచి జుక్కల్ మీదుగా మహారాష్ట్ర కర్ణాటక కు తరలిస్తున్నారు. అటు డోంగ్లి మదనూరు మీదుగా కూడా మానసకు తరలిస్తున్నట్లు సమాచారం.
మద్నూర్ మండలంలో వారం రోజుల క్రితం ఏకంగా ఒక మంత్రి అనుచరులే ఈ ఇసుక దందాకు తెర లేపారనే సమాచారం చెక్కర్లు కొడుతుంది. కొందరు మంత్రుల పేర్లు చెప్పుకొని దండ కొనసాగిస్తుండగా మరికొందరు జుక్కల్, బాన్సువాడ, ఎమ్మెల్యేలతో పాటు పేరు ప్రఖ్యాతలు గల మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని ఈ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇసుక మాఫియా జుక్కల్ బాన్సువాడ మధ్యన గల మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి జరగడం ఇసుక బకాసురులకు వరంగా మారింది. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్, బరంగేడ్గి, పొతంగల్, జుక్కల నియోజకవర్గంలోని సెట్లూరు, ఖత్గాం పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పది ట్రాక్టర్లను పట్టుకున్నాం
ఇసుక అక్రమార్కులను పట్టుకుంటూనే ఉన్నాం. మొన్న 10 ట్రాక్టర్లు పట్టుకున్నాం. ఎవరు ఉన్న ఉపేక్షించేది లేదు. కచ్చితంగా రే బిల్లులు ఉండాలి. సాయంత్రం 5:30 తర్వాత ఎలాంటి ఇసుక అక్రమ రవాణా చేయరాదు. అలా చేస్తే తమ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
బిచ్కుంద, తాసిల్దార్ వేణు గోపాల్