26 August, 2026 | 4:43 AM

విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన

26-08-2026 12:00 AM

భిక్కనూర్, ఆగస్టు 25 (విజయ క్రాంతి): బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రేమ పేరుతో మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలపై జాగ్రత్తలు వివరించారు.

సైబర్ నేరాల కోసం 1930, డ్రగ్స్ కోసం 1908, షీ టీమ్ 8712686094, అత్యవసర పరిస్థితుల్లో 100/112కు ఫోన్ చేయాలని సూచించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగిస్తూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ ప్రసన్నలక్ష్మి, ఉపాధ్యాయులు, షీ టీమ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.