26 June, 2026 | 6:47 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

విద్యార్థులు సమాజంపై సమగ్ర అవగాహన

03-03-2026 07:10 PM

హనుమకొండ,(విజయక్రాంతి): సుబేదారి ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ సమ్మయ్యనగర్ ప్రాంతంలో విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రజలతో అనుసంధానం పెంపొందించడం, విద్యార్థుల్లో సామాజిక బాధ్యతా భావం బలపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అంజన్ రావు మాట్లాడుతూ... విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. యువత సమాజ సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహను పెంపొందిస్తాయని తెలిపారు. ఎన్ఎస్ఎస్ విభాగం అధికారిని డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ, స్థానిక ప్రజలతో చర్చలు నిర్వహించారు.