3 March, 2026 | 8:25 PM

అభ్యాస పాఠశాలలో ఘనంగా హోలీ సంబరాలు

03-03-2026 07:13 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అభ్యాస పాఠశాలలో హోలీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలోని చిన్నారులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రావణ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు చిన్నారులు విద్యార్థులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సంబరంగా జరుపుకున్నారు. ఉపాధ్యాయులు సైతం చిన్నారులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు చిన్నారులు పాల్గొన్నారు.