15 August, 2026 | 1:46 AM

ఇండియా చిత్రపటంగా విద్యార్థుల వినూత్న ప్రదర్శన

15-08-2026 12:00 AM

అలంపూర్ ఆగస్టు 14 : 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మానవపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం వినూత్నంగా దేశభక్తిని చాటుకున్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు వరుసగా కూర్చొని భారతదేశ చిత్రపటం ఆకృతిని ఏర్పాటు చేసి, చేతుల్లో త్రివర్ణ పతాకాలతో ఆకట్టుకున్నారు. ఈ వినూత్న ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల ప్రదర్శనను ఎంఈఓ శివప్రసాద్ అభినందించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు.