12-11-2025 12:00:00 AM
తూప్రాన్, నవంబర్ 11 : తెలంగాణ కవి అందెశ్రీ అకాల మరణం పట్ల ది గ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ తూప్రాన్ మం డలం దాతరపల్లి సాంఘిక సంక్షేమ యువకుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులతో కలసి జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు.
అందెశ్రీ మరణం తీరని లోటని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా మౌనం పాటించారు.