12-11-2025 12:00:00 AM
పటాన్‌చెరు, నవంబర్ 11: అక్రమార్కులకు అడ్డూ, అదుపులేకుండా పోతుంది. అనుమతి పొందేది ఒకటైతే... నిర్మాణం చేసేది మరోలా ఉంటుంది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీలో అక్ర మ నిర్మాణాల జోరు పెరిగిపోతుంది...గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో జీ ప్లస్ టూ నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంది. ప్రస్తుతం ఇంద్రేశం మున్సిపాలిటీగా మారింది. దీంతో గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిన విధంగానే నిర్మాణాలను చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నాలుగు, ఐదు అంతస్తుల వరకు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
ఈ విషయంలో పలుమార్లు విజయక్రాంతి పలు కథనాలను ప్రచురించింది. అయినప్పటికీ అధికారుల్లో గానీ, అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లనే ఈ అక్రమ నిర్మాణాల జోరు పెరిగిపోతుంది. తాజాగా ఇంద్రేశంలోని పీఎన్‌ఆర్ కాలనీలో అక్రమ నిర్మాణాలకు అడ్డే లేకుండా పోతుంది.
ఎవరు మమ్మల్ని అడిగేది అనే రీతిగా ఇష్టానుసారంగా కట్టడాలు కడుతూ అటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ లక్షల రూపాయలను దోచుకుంటున్నారు. పీఎన్‌ఆర్ కాలనీని దశాబ్ధాల క్రితం పంచాయతీ అనుమతి ప్రకారం లే అవుట్ చేశారు. ఈ ప్లాట్లలో కేవలం 20 ఫీట్ల రోడ్డు వసతి మాత్రమే ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో నిబంధనలు మారిపోయాయి. కానీ నిబంధనల ప్రకారం ఇక్కడ ఏ భవనం కూడా కనిపించదు.
పర్యవేక్షణ నిల్.. వసూళ్లు ఫుల్..
ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వందలాది నిర్మాణాలు జరుగుతున్నాయి. అవుట ర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డు ఉండడం, సమీపంలోనే ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ ఉండడంతో ఇం ద్రేశంలో భూములకు, ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో పెద్ద సంస్థలు సైతం డుప్లె క్స్, అపార్టుమెంట్లు, లగ్జరీ ఇండ్లు భారీగా వెలుస్తున్నాయి. ఐదంతస్తుల అపార్టుమెంట్ కట్టాలంటే హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకొని నిబంధనల మేరకు నిర్మించాలి. అయి తే పంచాయతీగా ఉన్నప్పుడు తీసుకున్న అనుమతులతోనే అదనంగా రెండు, మూ డు అంతస్తులు కడుతూ వినియోగదారులను మోసం చేస్తున్నారు.
నిబంధనల ప్రకా రం ఇక్కడ మూడవ అంతస్తు నుండి కొన్న ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరగకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా మున్సిపల్ కమి షనర్ గానీ, టీపీవో గానీ తనిఖీలు చేయకుం డా కార్యాలయంలోనే బిల్డర్లను కలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విష యమై వివరణ కోసం మున్సిపల్ కార్యాలయం వెళ్ళగా కమిషనర్ అందులోబాటు లో లేరు.. ఫోన్ ఎత్తకపోవడం గమనార్హం.