calender_icon.png 12 November, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీ మార్గమే.. రాజా మార్గం

12-11-2025 12:00:00 AM

ఎస్‌ఐ కృష్ణారెడ్డి

జగదేవపూర్, నవంబర్ 11 : గజ్వేల్ కోర్టు ఆవరణలో ఈనెల 15న నిర్వహించనున్న లోక్‌అదాలత్‌ను సద్విని యోగం చేసుకోవాలని జగదేవపూర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం అయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. రాజీ పడదగ్గ కేసులను కక్షిదారులు లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. చిన్న చిన్న కారణాలతో పట్టింపులకు పోయి కోర్టు ల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులకు తమ కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్ చక్కని వేదిక అని అన్నారు.