07-11-2025 12:10:00 AM
గాంధారి నవంబర్ 6 (విజయ క్రాంతి): పాఠశాల ఎస్జీఫ్ రాష్ట్ర స్తాయి కబడ్డి అండర్ 17 బాల బాలికలకు పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం విద్యార్థులు భుక్య అర్జున్, బానోత్ ఉష ఎంపిక అయి నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలి పారు.
బుదువారం ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లల కబడ్డి పోటీల్లో అద్భుత ప్రదర్శనతో వీరిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు, ఈ నెల 8 నుండి భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఎద్దుల బయ్యారం,పి పిన పాక ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగే పోటీలో వీరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు ప్రాతినిధ్యం వహి స్తారు, ఎంపిక అయిన పాఠశాల క్రీడాకారులకు ప్రధానో పాధ్యాయుడు కుమారస్వామి గ్రామస్థులు అభినం దించారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఏర్గట్ల విద్యార్థిని రవీనా ఎంపిక
ఏర్గట్ల నవంబర్ 6 ( విజయ క్రాంతి): రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మండల కేంద్రం ఏర్గట్ల జడ్పి ఉన్నత పాఠశాల మండల విద్యార్థిణి రెండ్ల రవీనా ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణచారి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎస్. జి. ఎఫ్. అండర్ 17 బాలికల కబడ్డీ పోటీలను ముప్కాల్ లోని ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాలలో ఇటీవల నిర్వహించారని,
కబడ్డీ పోటిల్లో రవీనా మంచి క్రీడా నైపుణ్యా న్ని ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేసి ఉమ్మడి నిజాంబాద్ జిల్లా పోటీలకు పంపడం జరిగిందని, కామారెడ్డి లో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరచడంతో తమ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని రేండ్ల రవీనా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని దీనితో విద్యార్థిని రవీనా ను, పి. డి.జ్యోతి ను అభినందించారు.
ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి, ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, సమిత, ఎస్.శ్రీనివాస్, విజయ్ కుమార్, రాజేందర్, రాజనర్సయ్య, తాడూరి గంగాధర్, ప్రవీణ్ శర్మ, కే శ్రీనివాస్, ట్వింకిల్ కుమార్,నరేష్, కే గంగా మోహన్, కోమలి, రిషిక, కృష్ణవేణి, సి. ఆర్.పి లు గంగా ప్రసాద్, మహేందర్, తదితరులు, పాల్గొన్నారు.