07-11-2025 12:08:13 AM
అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే రానున్న మూడు నాలుగు రోజులు మాత్రం పొడి వాతావరణ ఏర్పడే అవకాశముందని తెలిపింది.