calender_icon.png 7 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి

07-11-2025 12:11:41 AM

ఈసీకి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం సీఈవో సుదర్శన్‌రెడ్డికి శాసనమం డలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి, ఇతర నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

జూబ్లీహిల్స్ ఎన్నికలో పార్టీ ఓడిపోతుందన్న భయంతో, ఆ తర్వాత తన పదవికి గండం ఉంటుందన్న ఆందోళన చెందు తూ రేవంత్‌రెడ్డి ఈ రకమైన వ్యాఖ్య లు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే, పథకాలు పోతాయని బెదిరిస్తున్నాడని దుయ్య బట్టారు. ఈ ఉప ఎన్నిక జరుగుతున్న నియోజక వర్గం పరిధిలో మీటింగ్ పెట్టి, ఇంత నగ్నంగా హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టడం ప్రజాస్వామ్యానికే మయని మచ్చ అని అభివర్ణిం చారు.

పోలీసులతో పాటు అధికార యం త్రాంగంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన షకీల్ ఇంటికి వెళ్లి బెదిరింపు చర్యలకు దిగిన వారిపై మధుసూధనాచారి నిప్పులు చెరిగారు.

ఎన్నికల ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ తెచ్చే దుర్మార్గం, ఈ పోలీసు అధికారుల వల్ల పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీసు సీఏఆర్‌పి పంపాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ ఎన్నికలో భాగంగా ఏ ఒక్క ఓటర్‌ను భయానక స్థితి కల్పించినా బీఆర్‌ఎస్ తరుపున ప్రతిఘటన సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు.