17 June, 2026 | 11:56 AM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత పాసులు ఇవ్వాలి

11-06-2025 10:50 PM

ఐఎస్ఎఫ్ మండల సమితి అధ్యక్షులు వేణుగోపాల్..

హుజురాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు పాసులు అందించాలని ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు వేణుగోపాల్(AISF Mandal President Venugopal) డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం డిపో మేనేజర్ రవీంద్రనాథ్(Depot Manager Ravindranath)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ... బస్సు పాస్ పెంపు నిర్ణయం పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమే అని అన్నారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పది లక్షలకు పైగా పేద, మధ్యతరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకోవడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా పట్టణాలకు వెళుతుంటారని ఈ చార్జీలు పెంపు ద్వారా వారిపై పెనుబారం పడుతుందని ఆర్టిసి యజమాన్యం నెలకు400 రూపాయలు ఉన్న బస్సు పాస్ చార్జి 600కు పెంచుతూ మూడు నెలల ప్యాకేజీని 19 నుంచి 1800 పెంచుతూ 20% పైగా చార్జీలు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.