విద్యార్థులు నిత్య పరిశోధకులు కావాలి
- ఆర్‌జేడీ సత్యనారాయణ రెడ్డి
- ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం
మంచిర్యాల,ఆగష్టు(విజయక్రాంతి): పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని ఆర్‌జేడీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవా రం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భ ంగా జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాలలో సైన్స్ కేంద్రం అధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విద్యార్థులు నిత్య పరిశోధకులు కావాలన్నారు.
శ్రీ హరికోట ద్వారా ఇస్రో గత ఏడాది చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టి చంద్రునిపై ల్యాండర్‌ను దింపి ప్రపంచ దేశాలలో అంతరిక్ష ప్రయోగాలలో అత్యుత్తమ స్థానాన్ని నిలబెట్టిందన్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను ప్రొత్సహించా లని సూచించారు. ఇస్రో నుంచి వచ్చిన అభినందన సర్టిఫికెట్లును విద్యార్థులు పొందేలా ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో డీఈవో యాదయ్య,సైన్స్ అధికారి మధుబా బు, ఎంఈఓ పోచ్చయ్య, సెక్టోరియల్ అధికారి చౌదరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






