calender_icon.png 15 July, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

15-07-2025 12:31:06 AM

వ్యవసాయ ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ జులై 14 (విజయ క్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు వసతి గృహాల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.

సోమవారం బాన్సువాడ నియోజకవర్గ  పరిధిలోని రుద్రూర్ మండలం అంబెం గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్,జూనియర్ కాలేజ్ ను బాలికల హాస్టల్ ను,వర్ని మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, వర్ని మండలం కోటయ్యక్యంప్ గ్రామంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం,వర్ని మండలం కోటయ్యక్యంప్ గ్రామంలో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల,

వర్ని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను ఆయనతోపాటు రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజులు అకస్మీకంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వసతి గృహాల్లోని వంట గది, సరుకుల నిల్వ గదులను తనిఖీ చేసి, సరుకులు,కూరగాయల నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

మేను ప్రకారం రోజు ఆహార పదార్థాలను పెడుతున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకుని విద్యార్థుల కోసం వండిన  అల్పాహారాన్ని తనే స్వయంగా తిని నాణ్యతను పోచారం పరిశీలించారు. ఆయన వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వర్ని మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీ సురేష్ బాబా గారు మరియు వర్ని, రుద్రూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పోచారం గారి వెంట ఉన్నారు