calender_icon.png 15 July, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా సంస్కృతే మా అభిమతం

15-07-2025 12:31:28 AM

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మహదేవపూర్, (భూపాలపల్లి) జూలై 14 (విజయ క్రాంతి): రాయలసీమ సంస్కృతి కాదు విద్యా సంస్కృతే మా అభిమాతం  అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పాఠశాలల ఆవర ణలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంతిని నియోజకవర్గాన్ని విద్యాపరంగా, అభివృద్ధి చేసి అందరికీ అవకాశాలు కల్పిం చడమే నా ప్రధాన  లక్ష్యం అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కృషి  చేస్తున్నారని అన్నారు.

గివ్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ ఆధ్వ ర్యంలో, పాఠశాలల్లోని 650 మంది విద్యా ర్థులకు షూస్, స్పోరట్స్ షూస్ పంపిణీ  చేశారు.మొదటగా పాఠశాల ఆవరణలో అటవీ శాఖ  అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. ఖేల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. మహదేవ్ పూర్ ప్రభుత్వ పాఠశాలకు మంచి చరిత్ర  ఉందని ఈ పాఠశాలలను ఒక పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకుని సి.ఎస్.ఆర్ నిధులు సుమారు 15 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు.

ఈ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. మహదేవ్ పూర్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి మెరుగైన విద్యను అందిస్తున్నారని అభినందించారు. ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాల నుండి సుమారు 245 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం గొప్ప విషయం అని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గమనించాలని రాబోయే రోజుల్లో గొప్ప స్థాయిలో ఎదిగి ప్రభుత్వానికి,గ్రామానికి తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని మంత్రి కోరారు. 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చాలా చురుకుగా విద్యను అభ్యసి స్తున్నారని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యార్థుల సౌకర్యార్ధం అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అంతేకాకుండా బాలికల కోసం జిల్లాలో మొట్టమొదటి సారిగా మహాదేవపూర్ జిల్లా పరిషత్ బాలికల  పాఠశాలలో సానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ రూ.5 లక్షల తో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

విద్యార్థులు చక్కగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాయాంక సింగ్,అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, గివ్ ఫౌండేషన్ ప్రతినిధులు అరుణ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ , ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతయ్య, కాంగ్రెస్ నాయకులు, వామన్ రావు, మాజీ ఎంపిటిసి అభ్యర్థుల సుధాకర్, యూత్ నాయకులు విలాస్ రావు, అశోక్, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.