15-07-2025 12:29:50 AM
గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్..
ముషీరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): అభివృద్ధి పనుల అమలు విషయంలో వివి ధ విభాగాల ప్రభుత్వాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ కోరారు. డివిజన్ లోని పలు ప్రాంతాల్లో సేవరేజ్, మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనుల విషయంలో జలమండలి, జీహెఎంసీ ఇంజినీరింగ్ విభాగం మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రజాభివృద్ధి పనులు ఆగిపోకండా చూసుకోవా లని సూచించారు.
సోమవారం గాంధీనగర్ డివిజన్‌లోని కార్పొరేటర్ కార్యాలయంలో జలమండలి డీజీఎం కార్తీక్‌రెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్, జీహెఎంసీ ఇంజినీరింగ్ విభా గం వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్ ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.