calender_icon.png 8 January, 2026 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించేల తీర్చిదిద్దాలి

06-01-2026 06:58:49 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతి విద్యార్థి ఆంగ్లభాషపై పట్టు సాధించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న ఇంగ్లీష్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు ఆంగ్ల, తెలుగు, హిందీ భాషలలో పఠన సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులు ఆంగ్ల భాషలో ఆశించిన స్థాయిలో ప్రావీణ్యం చూపడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో ప్రతి విద్యార్థితో ఉపాధ్యాయుడు ఇంగ్లీషులోనే మాట్లాడాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటగదిని, భోజన పదార్థాలను, మెనూ కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, ఎంఈఓ నెహ్రు, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.