06-01-2026 07:04:09 PM
సుల్తానాబాద్ తాహసిల్దార్ బషీరుద్దీన్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులతో తహశీల్దార్ ఎండి బషీరుద్దిన్ మంగళవారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 28వ తేదీ నుండి సుల్తానాబాద్ మండలంలోని నీరుకుళ్ళ గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించి తగు సూచనలు జారీ చేయడం జరిగింది.
జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం త్రాగు నీరు, పరిశుభ్రత, రహదారి, పార్కింగ్, నిరంతర విద్యుత్ సౌకర్యం, మెడికల్ టీమ్, పోలీస్ భద్రత మరియు ఇతర సౌకర్యాల పై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, ఎస్సై చంద్రకుమార్, సుల్తానాబాద్ మున్సిపల్ మేనేజర్ అలీ మొద్దీన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.