calender_icon.png 8 January, 2026 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

06-01-2026 06:53:59 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడాంశాలలో ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనక కర్ణు, పీడీ హీరాబాయి తెలిపారు. ఈ ఎంపికల్లో ఖో–ఖో, కబడ్డీ, టెన్నికాయిట్ విభాగాల్లో విద్యార్థులు రాష్ట్ర స్థాయికి చేరుకున్నారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 7 నుంచి 9 వరకు ఏటూరు నాగారంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చాలని ఐటీడీఏ పీఓ యువరాజ్ మార్మాట్, డీడీ రమాదేవి, ఏటిడీవో శివకృష్ణ, ఆశ్రమ పాఠశాల క్రీడల అధికారి మాడవి షేకు, ఏసీఎంఓ ఉద్దవ్, జీసీడీఓ శకుంతల, హెచ్‌డబ్ల్యూఓ మధుకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చంద్రశేఖర్, జాగేశ్వర్, గోపాల్, లక్ష్మీనారాయణ, కిషన్, కిరణ్ కుమార్, అనిత, ప్రేమలత, సతీష్, తిరుపతి, వందన, సరస్వతి, పీడీలు మధుసూదన్, కడతాల రాకేష్ విద్యార్థులను అభినందించారు.