13 August, 2026 | 10:07 AM

సైబర్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

13-08-2026 08:55 AM

ఎస్ఐ మధు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు12: విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అర్వపల్లి ఎస్ఐ పి మధు సూచించారు.బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ లో రోడ్డు భద్రత,గంజాయి నిర్మూలన,ఆన్లైన్ మోసాలు,ఫేక్ కాల్స్,నకిలీ లింకులు,సోషల్ మీడియా మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.విద్యార్థినీల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్,డయల్ 112 సేవలను అందుబాటులోకి తెచ్చిందని,విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత స్థాయికి చేరాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మల్లేష్,ఉపాధ్యాయులు,పోలీసు సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.