1 April, 2026 | 11:56 AM

Breaking News

దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •   కమర్షియల్ గ్యాస్ ‘మంట’.. భారీగా పెరిగిన సిలిండర్‌ ధర   •  

విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి

08-02-2025 12:51 AM

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ 

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): విద్యార్థులు ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవాలని జిల్లా  కలెక్టర్ బాధవత్ సంతోష్ అన్నా రు. శుక్రవారం కొల్లాపూర్ నియో జకవర్గంలోని విద్యార్థులకు, యువత లో ప్రేరణ, ఆత్మవిశ్వాసం, పెంపొం దించడానికి రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో పట్టణంలోని మినీ స్టేడియం లో నిర్వహించిన సదస్సుకు  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

విద్యా ర్థులు పరీక్షల్లో నేర్చుకున్న విషయా లను సరైన విధంగా రాయలేక పోవడం ఒక ప్రధాన సమస్యగా మా రిందన్నారు.  దీని కారణంగా వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతూ, కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కోల్పోయి తప్పుదారుల్లో వెళ్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నా రు.

జీవితంలో ప్రతి ఒక్కరికి అపజ యం ఎదురవుతుందని, దాంతో కృంగిపోవద్దని తిరిగి దానిపై పోరాడి విజయం సాధించే వరకు కష్టపడాలని విద్యార్థులకు సూచించారు.  ఈ కార్య క్రమంలో డీఈవో రమేష్ కుమార్, డిఐఓ వెంకటరమణ, ఆర్డీవో బన్సీలా ల్, తాసిల్దార్ విష్ణు వర్ధన్ రావు వివిధ పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.