మైలారం మైనింగ్ నిలిపివేయాలి
అచ్చంపేట, ఫిబ్రవరి 7: బల్మూరు మండలం మైలారం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న మైనింగ్ తవ్వకాలను వెంటనే నిలిపివే యాలని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ నర్సింహా డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ బృందం గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మైలారం గ్రామంలో మేకలు గొర్రెలు, బర్రెలు ఆవులు, మొత్తం మూగ జీవాలు దాదాపుగా 2500 వేల ఉంటాయని మైనింగ్ తవ్వకాల వల్ల మూగజీవాలు మృత్యువాత పడుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్ తవ్వకాలకు ఇచ్చిన అనుమ తిని రద్దు చేయాలని అధికారులను కోరారు.
ఈ విషయంపై ప్రజాప్రతి తులను ఉన్నతాధికారులను కలిసి గ్రా మంలో జరుగుతున్న నష్టాన్ని ప్రభు త్వానికి వివరిస్తామన్నారు. వారితో పాటు సిపిఐ నాయకులు వార్ల వెంకట య్య, కేశవులు, నరసింహ, తిరుమల గోపాల్, శ్రీనివాసులు, మారేడు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.




