రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం(Rajendra Nagar) మైలార్‌దేవ్‌పల్లి లో బుధవారం తెల్లవారుజామున హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. రూ. 100 కోట్ల విలువైన 188 ఎకరాల క్రీడా మైదానం స్థలాన్ని కాపాడింది. శాస్త్రిపురంలోని హుడా లేఅవుట్ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా(Hydra Demolitions) అధికారులు నేలమట్టం చేశారు. క్రీడా మైదానానికి కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణ దశలో ఉన్న జీ ప్లస్ 3 అంతస్తుల 5 భవనాలను హైడ్రా తొలగించింది.
కబ్జాదారులు ఈ స్థలంలో మూడేళ్లుగా నోటరీ చేసి విక్రయిస్తున్నారు. క్రీడా మైదానం స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. జీహెచ్ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చితలు చేపట్టారు. స్థానిక నివాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పార్కు కోసం ఉద్దేశించిన ఆ భూమిని పరిరక్షించినందుకు హైడ్రాను అభినందించారు.




