calender_icon.png 12 December, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవేశ పరీక్షకు విద్యార్థులు హాజరు కావొద్దు

12-12-2025 12:00:00 AM

రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు

అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 11: అనుమతులు లేని మెగా రెసో ఫాస్ట్ పాఠశాలల యజమాన్యం నిర్వహించే ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎవ్వరు హాజరు కావొద్దని రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. మెగా రెసో ఫాస్ట్ పాఠశాలలో విద్యా అభ్యసించడానికి యజమాన్యం విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను తమ పాఠశాలలో  అడ్మిట్ చేసుకుంటాయి.

అందులో భాగంగా ఈ నెల 14 విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాధికారి సుశీందర్ రావు దృష్టికి సమాచారం వెళ్లింది. దీంతో జిల్లా పరిధిలో వనస్థలిపురం, మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మణికొండ ప్రాంతాలలో ఉన్న మెగా రెసో ఫాస్ట్ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేనందున్న విద్యార్థులు ఎవ్వరు కూడా ప్రవేశ పరీక్షలకు హాజరు కావొద్దని డీఈవో సూచించారు. అనుమతులు లేని పాఠశాలపై చర్యలు   తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు వహించాల్సింది కోరారు.