9 July, 2026 | 12:57 AM

విద్యార్ధులు డ్రగ్స్‌కు బానిస కావొద్దు

09-07-2026 12:24 AM

మొయినాబాద్ ఇన్స్‌పెక్టర్ మల్లికార్జున రెడ్డి 

మొయినాబాద్ జూలై 8(విజయ క్రాంతి): యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వై.మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మునలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వై.మల్లికార్జున రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతిల్లోనే ఉందన్నారు. అలాంటి యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయని విద్యార్థులకు వివరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ.. విద్యా, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల సంబంధించిన అనుమానస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఎన్ సీసీ క్యాండెట్లు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.