14 July, 2026 | 11:52 AM

Breaking News

మహారాష్ట్రలో గుట్కా నిషేధం.. తెలంగాణ నుండి జోరుగా రవాణా!   •   లులు మాల్‌లో గన్ కలకలం   •   కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •  

గచ్చిబౌలి ఎఫ్‌సీఐ లేఅవుట్‌లో అక్రమ కబ్జాలపై హైడ్రా- సీఎంసీ కమిషనర్ల తనిఖీ

09-07-2026 12:23 AM

శేరిలింగంపల్లి, జూలై 8 (విజయక్రాంతి): గచ్చిబౌలి ఎఫ్సీఐ లేఅవుట్లోని రోడ్లు, పార్కుల అక్రమ కబ్జాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్, సిఎంసీ కమిషనర్ సృజన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత ప్లాట్ ఓనర్లతో కలిసి 40, 25 అడుగుల రోడ్లు మరియు పార్కు స్థలాలను తనిఖీ చేశారు.

1981లో ఏర్పాటైన ఈ లేఅవుట్ను సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టాడని బాధితులు ఆరోపించారు. హైకోర్టు స్టేటస్ క్వో ఆదేశాలను ఉల్లంఘించి మళ్లీ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ దౌర్జన్య నిర్మాణాలు చేపడుతున్నారు. చట్టపరమైన చర్యలు చేపడుతామని,రోడ్లు,ఓపెన్ స్పేస్లను హైడ్రా కాపాడుతుందని హెచ్చరించారు.