27 May, 2026 | 6:25 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులు సమర్థంగా సిద్ధం కావాలి

27-05-2026 05:08 PM

డిప్యూటీ డీఈఓ చందన్..

ఉట్నూర్, (విజయక్రాంతి): ఉట్నూరులోని  కేబీ కాంప్లెక్స్‌లోని వికాసం పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత పొందలేక సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను డిప్యూటీ డీఈఓ చందన్ బుధవారం సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ  మాట్లాడుతూ, వచ్చే నెల 5వ తేదీ నుండి ప్రారంభంకానున్న పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రత్యేక తరగతులలో ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టును విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని ఆయన అన్నారు.

అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించిన విధానాన్ని పరిశీలించిన ఆయన, సబ్జెక్టు వారీగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులు సందేహాలను వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని, ప్రతిరోజూ పునశ్చరణ చేస్తూ పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి, విద్యార్థుల విజయం కోసం ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని కోరారు.