17 June, 2026 | 4:34 PM

Breaking News

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

17-06-2026 03:18 PM

సర్పంచ్ కోలే జ్యోతి

​వాంకిడి, (విజయక్రాంతి): విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జైత్‌పూర్ సర్పంచ్ కోలే జ్యోతి పిలుపునిచ్చారు. బుధవారం వాంకి మండలం జైత్‌పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నుండి ఉచితంగా అందించిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులను విద్యార్థులకు ఆమె పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధనతో పాటు ఉచితంగా దుస్తులు, భోజనం, పుస్తకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తమ పిల్లలను బడికి పంపాలని, ఇంట్లోనూ చదివించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ దుర్గం సందీప్, హెచ్‌ఎం రాధ, గ్రామ నాయకులు పత్రు, తిరుపతి, సదాశివ తదితరులు పాల్గొన్నారు.