30-07-2025 01:47:45 AM
- ఘనంగా సింగరేణి సీఎండీ అండ్ చైర్మెన్ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు
- నిజాం కళాశాల, నగరంలోని వివిధ ఎస్టీ హాస్టల్లో పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ
- గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహన్
ముషీరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిం చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సింగరేణి సీఎండి అండ్ చైర్మెన్ బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని బషీర్బాగ్ లోని నిజాం కళాశాలతో పాటు నగరంలోని వివిధ ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేష్ చౌహన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అం బేద్కర్ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క స్ఫూర్తితో ఎంతో కష్టపడి ఒక పేద ఒక నిరుపేద తండా నుంచి మారుమూల గ్రామం నుంచి వచ్చి అనేకమైన సమస్యలను ఎదుర్కొని ఒక డైనమిక్ ఆఫీసర్గా ఉన్నతమైన స్థానంలో ఉండడం గర్వించదగిన విషయం అన్నారు.
నేడు సింగరేణి లాంటి సంస్థను ఎంతో బలోపేతం చేసి ప్రభుత్వానికి లాభా ల దిశగా తీసుకపోవడం అలాగే ఎన్నో చెట్లు నాటి ఒక ట్రీ మ్యాన్‌గా ఒక ఆదర్శవంతమైన సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఎంతో మంది నిరుపేద బిడ్డల కు సింగరేణిలో ఎన్నో ఇబ్బందులు ఉంటే వారందరినీ అండగా దండగా ఉంటూ భీమా లాంటి పథకాలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఒక డైనమిక్ ఆఫీసర్ గా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి బలరాం నాయక్ జీవితం అందరికీ ఆదర్శమని డాక్టర్ వెంకటేష్ చౌహన్ తెలిపారు. డాక్టర్ మెండం కిరణ్ కుమార్ బలరాం నాయక్ యువతకు ఒక ఆదర్శవంతమైన ఒక ఐకాన్ అని, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐతరాజు అభేందర్, దళిత యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రపల్లి రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ హైదరా బాద్ ఉపాధ్యక్షుడు శ్రీమాన్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు శంభు నాయక్, రాజశేఖర్, భరత్ నాయక్ పాల్గొన్నారు