31-07-2025 10:54:56 AM
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నేడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక(Kaleshwaram Commission Report) సమర్పించనుంది. 2024 మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) ఆనకట్టలకు సంబంధించి ఏడాదికి పైగా విచారణ చేశారు. 155 మందిని విచారించిన పీసీ ఘోష్ కమిషన్ సాక్ష్యాలు నమోదు చేసింది. ఇంజినీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించింది. గత ప్రభుత్వ పెద్దలు, ఇతరులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలు, విధానపర నిర్ణయాలపై కమిషన్ విచారించింది. రీ ఇంజినీరింగ్, ఆనకట్టల డిజైన్, లోకేషన్, నిర్మాణం, నాణ్యతపై కమిషన్ దృష్టి సారించింది. టెండర్ ప్రక్రియ, అంచనాల పెంపు, చెల్లింపులు, కాళేశ్వరం కార్పొరేషన్(Kaleshwaram Corporation), ఇతర అంశాలపై కమిషన్ విచారణ జరిపింది.