31-07-2025 09:57:56 AM
ముంబై: స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) భారతదేశంపై 25 శాతం సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. టారిఫ్ లను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు (-0.67శాతం) పడిపోయి, 80,975 వద్ద స్థిరపడింది. ఇంతలో, నిఫ్టీ 50 150 పాయింట్లు (-0.60శాతం) కోల్పోయి 24,704 వద్ద స్థిరపడింది. చమురు స్టాక్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయి, IOCL 3.12 శాతం, BPCL 2.42 శాతం పడిపోయాయి. భారత దిగుమతులపై 25శాతం సుంకాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత తాజా పతనం జరిగింది.