31-07-2025 12:05:32 PM
కృష్ణపట్టే ప్రజలు అత్యవసర సమయంలో 100కు డయల్ చేసి పోలీసుల సహాయం పొందండి.
హుజూర్ నగర్ సీఐ చరమందరాజు
హుజూర్ నగర్: కృష్ణ నది వరద ప్రవాహానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజూర్ నగర్ సీఐ చరమందరాజు(Huzurnagar CI Cherabanda Raju) అన్నారు. గురువారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థాయిలో గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం అత్యధికంగా దిగువ ప్రాంతానికి వరద నీరు వస్తున్నందున హుజూర్ నగర్ నియోజకవర్గంలో పాలకీడు మండలం, మఠంపల్లి మండలం, చింతలపాలెం మండలాలో ఉన్న కృష్ణనది ఆనుకొని ఉన్న కృష్ణపట్టే గ్రామాల ప్రజలు వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలలో ఉండాలన్నారు.పశువుల మేత కోసం, వ్యవసాయ మోటార్లు కోసం,చేపల వేటకు నీటిమీద ఎలాంటి రవాణా చేయడానికి వెళ్లరాదని సూచించారు.అధికారుల సూచనల మేరకు ఎప్పటికప్పుడు స్పందించాలి. కృష్ణానది ప్రవహించే కృష్ణ పట్టే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే పోలీసు అత్యవసర సేవా విభాగం 100కు డయల్ చేసి పోలీసుల సేవలు వినియోగించుకోవాలి అని ఒక ప్రకటనలో తెలిపారు.