calender_icon.png 1 August, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ కవితవి డైవర్షన్ పాలిటిక్స్

30-07-2025 01:47:00 AM

  1. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో దీక్షచేయాలి 
  2. దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్న కవిత 
  3. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  

హైదరాబాద్, జులై 29 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై పోరాటం చేస్తామని ప్రకటిస్తే.. కవిత మా త్రం దీక్షలు చేస్తానంటూ డ్రామాలు మొద లు పెట్టిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఏ హోదాతో దీక్ష చేస్తారో చెప్పా లని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌ను ఢిల్లీకి తీసుకొచ్చి బీజేపీ సర్కార్‌పైన పోరాటం చేయాలని కవితకు ప్రభుత్వ విప్ సూచించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే కవిత, కేటీఆర్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని, బీజేపీపైన మాట్లాడటానికి నోరెందుకు రావడం లేదని ప్రశ్నించారు.

కవితకు తెలంగాణలో దీక్ష చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీ లో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపామని, ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపామ ని, తమ చిత్తశుద్ధిలో ఎలాంటి లోపం లేదన్నారు. కల్వకుంట్ల డ్రామాలను ప్రజలు న మ్మరనే విషయం గుర్తుంచుకోవాలని ఆ యన హితవు పలికారు.

బీజేపీతో ఢిల్లీలో దోస్తీ: విప్ అయిలయ్య  

బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తానంటున్న కవిత హైదరాబాద్‌లో కాకుండా ఢిల్లీలో దీక్ష చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సూచించారు. బీజేపీతో గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీల పక్షపాతి అని, రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో దీక్ష చేసేందుకు ముందుకు వచ్చారని, తామందరం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరా టం చేస్తామన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో బీసీ రిజర్వేషన్లను తగ్గించినప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బీజేపీపై మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నారని, తెలంగాణలో దీక్ష చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు.