30-07-2025 01:48:22 AM
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): 42శాతం రిజర్వేష న్ల వెనక కాంగ్రెస్ పార్టీకి ఓ రాజకీయ అజెండా దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ ఆరోపించారు. రిజర్వేషన్లను అమలు చేయడంలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఈ వ్యవహారంలో రాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధ పదవిపై ఆరోపణలు చేయడం క్షమా ర్హం కాదన్నారు. 42శాతం రిజర్వేషన్ల కోసం బీజేపీని, రాష్ట్రపతిని నిందించ డం బదులుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అవసరమైన సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.
అగ్రవర్ణాలలోని పేదలకు 10శాతం రిజర్వేష న్ల కోసం తాము రాజ్యాంగాన్ని సవరించిన తీరును ఆయన ఉదహరించారు. మతం ఆధారిత రిజర్వేషన్లకు అవకాశం లేకున్నా కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ వైఖరితో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తోందని, దీనిని బీజేపీ ముమ్మాటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు.