calender_icon.png 6 May, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు లక్ష్యంతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి

24-04-2025 12:58:32 AM

జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి

దౌల్తాబాద్, ఏప్రిల్ 23: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకోని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు విలువ లభిస్తాయని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని వాస్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో మండల విద్యాశాఖ అధి కారి సత్యనారాయణరెడ్డి, పూర్వ విద్యా ర్థులు డాక్టర్ పెంటాచారి, ప్రజాహిత ఫౌం డేషన్ అధ్యక్షులు మామిడి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, బాగా న్నగారి రవీందర్ రెడ్డి లతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ముందుగా పూర్వ విద్యార్థుల బయోడేటా పుస్తకం, పాఠశాల బడిబాట గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించే విధంగా కృషి చేయాలని తెలిపారు. అబ్దుల్ కలాం మాటలు గుర్తు చేస్తూ కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని అన్నారు.

వార్షి కోత్సవంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.పాఠశాల స్థాపించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు పుస్తకం ఆవిష్క రించగా వివిధ రంగాలలో స్థిరపడిన విద్యార్థుల వివరాలు నమోదు చేయడం జరుగు తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, లైబ్ర రీ, ల్యాబ్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, నిష్ణతులైన ఉపాధ్యాయుల చేత విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. 

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో బట్టి చదువులు అధిక ఫీజులతో తల్లిదండ్రులకు పెనుబారంగా మారాయన్నారు. ప్రభుత్వ పాఠశాల లో చదువుకున్నవారే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు.విద్యార్థులు  గంజా యి, మద్యం వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రమశిక్షణ నైతిక విలువలతో కూడిన విద్యనభ్యసించాలన్నారు.

విద్యార్థులు పాఠశాలల కంటే తల్లిదండ్రుల వద్ద ఎ క్కువ సమయం ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులను ఎప్పటికప్పుడు వారి ప్రవర్తనను గమనిస్తుండాలి.మొబైల్, టీవీ, వాహనాలు వంటి వాటికి విద్యార్థులను దూ రంగా ఉంచాలన్నారు.

పదవ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన మొదటి నలుగురికి ఒకరికి పది వేలు, మిగతా ముగ్గురికి ఐదు వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తానని ప్రజాహిత ఫౌండేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి ప్రకటించారు. 

ఈ కార్య క్రమంలో మండల ప్రత్యేక అధికారి బాబునాయక్,ఎంపీడీవో బాల య్య, తహసిల్దార్ శ్రీనివాస్, పాఠశాల ఇన్చా ర్జి ప్రధానోపాధ్యాయులు నాగరాజు, పంచాయతీ కార్యదర్శి శివకుమార్,  పాఠశాల ఉపాధ్యాయులు, సిఆర్పిలు, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.