24-04-2025 12:59:22 AM
చేవెళ్ల/రాజేంద్రనగర్, ఏప్రిల్ 23 : తాంత్రిక పూజలు, ఓ అమ్మాయితో ప్రేమ, పెళ్లి.. అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ‘అఘోరి’ కథ కారాగారానికి చేరింది. ఓ మహిళను చీటింగ్ చేసిన కేసులో అఘోరికి చేవెళ్ల కోర్డు 14 రోజుల రిమాండ్ విధిం చింది.
మోకిలా సీఐ వీరాబాబు వివరాల ప్రకారం.. శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి (28) గతంలో చెన్నై, ఇండోర్ లలో లింగ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వా రా తనను తాను అఘోరి మాతగా, ఆధ్యాత్మిక దేవిగా ప్రచారం చేసుకుంటూ.. పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను మో సం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాడు.
ఇందులో భాగంగానే శంకర్ పల్లి మండలం ప్రొద్దటూరులోని ప్రగతి రిసారట్స్ లో నివాసం ఉంటున్న మహిళ(సినీ నిర్మాత)తో సోషల్ మీడియా ద్వారా స్నేహం పెంచుకున్నాడు. తనను ఒక ఆధ్యాత్మిక రక్షకుడిగా చూపిస్తూ.. ఆమె కుటుంబాన్ని దుష్ట శక్తుల నుంచి రక్షించేందుకు తంత్ర పూజలు చేయాల్సిన అవసరం ఉందని నమ్మబలికాడు.
ఈ నెపంతో మొదట రూ. 5 లక్షలు, ఆ తర్వాత బెదిరింపుల ద్వారా మరో రూ. 4.80 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత కూడా బాధితురాలిని కత్తులు, తుపాకీలతో బెదిరించి మ రో రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. అంతేకాదు తాంత్రిక శక్తులతో చంపేస్తానని హెచ్చ రించాడు. భయపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో చీటింగ్, బెదిరిం పులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఐదుగురు పోలీసుల(ఎస్త్స్ర, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుల్స్)తో ఒక ప్రత్యేక బృందా న్ని ఏర్పాటు చేసి.. నిందితుడిని మంగళవారం ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు.
5 గంటల పాటు విచారణ
యూపీ వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం అఘోరిని బుధవారం ఉదయం నేరుగా నార్సింగి ఏసీపీ ఆఫీసుకు తీసుకొచ్చారు. అక్కడ దాదాపు 5 గంటల పాటు విచారించిన పోలీసులు.. ఇప్పటి వరకు ఎంతమం దిని పూజల పేరుతో మోసం చేశారు..? ఇంకా ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చే శారా..? అనే కోణంలో పలు వివరాలు సేకరించారు.
అతడి వద్ద నుంచి రూ. 5,500 తో పాటు క్రైం సమయంలో వాడిన హ్యుం దాయ్ ఐ20 కారును స్వాధీనం చేసుకున్నా రు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు చేయించి.. చేవెళ్ల కోర్టులో ముందు హాజరు పరిచారు. విచారించిన న్యాయమూర్తి నిందిడుడికి 14 రోజు ల రి మాండ్ విధించారు. దీంతో పోలీసులు అఘోరిని సంగారెడ్డిలోని కంది సెంట్రల్ జైలుకు తరలించారు.
జెండర్ క్లారిటీ లేకపోవడంతో మళ్లీ వెనక్కి!
అఘోరిని కంది సెంట్రల్ జైలుకు తరలించిన తర్వాత అక్కడి అధికారులు అతన్ని మగవాళ్ల బ్యారక్ లో ఉంచాలా..? ఆడవాళ్ల బ్యారక్‌లో ఉంచాలా..? అనే విషయంలో సందిగ్ధం ఏర్పడింది. పోలీసులు మెడికల్ రిపోర్టు చూపించగా.. అందులో సాధారణ టెస్టుల తప్ప.. లింగ నిర్ధారణ టెస్టులు చేయలేదు. దీంతో జైలు అధికారులు తమ జైలు లో ఉంచుకోలేమని చెప్పడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చి లింగ నిర్దారణ టెస్టులు చే యించారు. ఇందులో ‘ట్రాన్స్ జెండర్’గా తేలింది. దీంతో మళ్లీ కోర్టుకు తీసుకెళ్లగా... న్యాయమూర్తి ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక బ్యారక్ లు ఉన్న చంచల్ గూడ జైలుకు తరలించాలనిఆదేశించారు.అక్కడికి తీసుకెళ్లారు.
పోలీసులకు సహకరిస్తున్నా: అఘోరి
చేవెళ్ల కోర్డు ఎదుట, ఏసీపీ ఆఫీసు ఎదు ట మీడియాతో మాట్లాడిన అఘోరి తాను పోలీసులకు, కోర్టుకు సహకరిస్తున్నానని చె ప్పారు. చట్టం తనపని తాను చేసుకుపోతోందని అన్నారు. తన భార్య తనతో ఉంటుం దని, ఈ విషయం కోర్టులో ఉన్నందున అక్క డే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. తనతో పంపిస్తే జైలుకు కూడా తీసుకెళ్తానని అనడం గమనార్హం.