8 April, 2026 | 2:16 AM

విద్యార్థులు నీటిని వినియోగించుకోవాలి

08-04-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని ఎంజేబీ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడు తూ విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు అందించడం ఎంతో ముఖ్యమని, ఏర్పాటు చేసిన ఈ శుద్ధి కేంద్రం ద్వారా వారికి స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి రావడం ఆనందదాయక మన్నా రు. విద్యార్థులు అందుబాటులో ఉన్న మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లా అటవీ అధికా రి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ మాట్లాడుతూ సమాజ సేవలో భాగం గా అట వీ శాఖ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ స్వాతి, అటవీ శాఖ అధికారులు గోవింద్ చంద్ సర్దార్, యోగేష్ కులకర్ణి, మహేందర్, రాజేష్, వెంకటేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.