2 July, 2026 | 5:08 PM

Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •  

లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు

01-06-2025 05:42 PM

ఎమ్మెల్యే మురళి నాయక్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) అన్నారు. చదువుకు పేద ధనిక బేధం లేదని, చక్కగా చదువుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం స్వచ్ఛంద సంస్థల చేయూత అవసరమని ఆయన పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్యా తండాలో ఎన్‌ఎఫ్‌హెచ్‌సి ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణా శిబిర ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కేసముద్రం, ఇనుగుర్తి మండల పరిధిలో పదవ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు విజేత పురష్కార్ అవార్డ్స్ అందజేసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్, డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్, డాక్టర్ జె. రాజారాం, కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్, లీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాసుల రవికుమార్, బ్రహ్మ సమాజ్ ప్రతినిధి మధు బిందు, కొమ్ము రాజేందర్, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శాస్త్రవేత్త మోహన్, జనరల్ సెక్రటరీ జయకృష్ణ, డైరెక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.