calender_icon.png 8 August, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ దేవాలయంలో సబ్ కలెక్టర్ పూజలు

08-08-2025 12:59:14 AM

బెల్లంపల్లి, ఆగస్టు 7 : బెల్లంపల్లి మండలంలోని కన్నాల బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ వరప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయ న తన తల్లిదండ్రులతో బుగ్గ సందర్శించా రు.

సబ్‌కలెక్టర్‌ను ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల వేణుగోపాల శాస్త్రి, సతీష్ శర్మలు ప్రత్యేకంగా ఆహ్వానించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి తాసిల్దార్ కృష్ణ,బుగ్గ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, కన్నాల మాజీ సర్పంచ్ స్వరూప పాల్గొన్నారు.