08-08-2025 12:58:27 AM
-పంచాయతీ కార్యదర్శులకు సూచన.
-కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
-ఆస్తి పన్ను వసూలు సకాలంలో పూర్తి చేయాలి
రాజన్న సిరిసిల్ల:ఆగస్టు 7 (విజయక్రాంతి)గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. గురువారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ పై ఎం.పి.ఓ.ప ంచాయతీ కార్యదర్శులు, ఏ.ఎన్.ఎం. లతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డెంగ్యూ, మల్లే రియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యా ధులు వ్యాప్తి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఫీవర్ కేసులకు తప్పనిసరిగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.
ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పట్ల అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి అరికట్టాలన్నారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతంలో ప్రత్యేకంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, చుట్టుపక్కల ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శి బాధ్య తతో గ్రామంలో పిచ్చి మొక్కల తొలగింపు, అధికంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యల చేపట్టాలని వెల్లడించారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని హై రిస్క్ ఏరియాలను గుర్తించి అక్కడ డ్రై డే పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు.
ప్రతి గ్రామంలో వారానికి రెండు సార్లు మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమం జరగాలని ఆదేశించారు.ఆశా, ఏ.ఎన్.ఎం లు ఇంటింటి సర్వే నిర్వహించి నీటి నిల్వ వల్ల కలిగే నష్టాలు, దోమల తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తు న్నారని తెలిపారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్ అధికారులు పరిధిలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హెల్త్ సబ్ సెంటర్ పరిధిలో అవసరమైన మేర వ్యాధి నిర్ధారణ కిట్లు అందు బాటులో పెట్టాలని అన్నారు.
ప్రతి పీ.హెచ్. సి పరిధి లో లక్ష్యాలు నిర్దేశించుకొని నిర్దారణ పరీక్షలు చేయాలని అన్నారు.డెంగ్యూ కేసులను తక్కువ చేసి చూపించే అవసరం లేదని, మనం ఎన్ని డెంగ్యూ కేసులు గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందిస్తే అంత బాగా పని చేసినట్లుగా పరిగణిస్తామని కలెక్టర్ తెలిపారు.ఔట్ పేషెంట్ వచ్చే ప్రతి ఫీవర్ కేసు రోగి కు తప్పనిసరిగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. డెంగ్యూ నిర్ధారణ జరిగిన కేసులలో నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించడం పరిసర ప్రాంతాల పారిశుధ్య పనులు జరిగేలా చూడాలని అన్నారు.
డెంగ్యూ కేసులను రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలని, రక్త కణాలు ఎలా ఉంటున్నాయో పరిశీలించాలని అన్నారు. మన విధులలో చూపెట్టె చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం సభ్యులను కోల్పో యే ప్రమాదం ఉంటుందని, దయచేసి అధికారులు సిబ్బంది అంతా అప్రమత్తతో విడు దల నిర్వహించాలని అన్నారు. సిరిసిల్ల , వేములవాడ ఆసుపత్రులకు అధికంగా రోగులు వస్తున్నారంటే క్షేత్ర స్థాయిలో పి.హెచ్.సి పని తీరు సరిగ్గా ఉండటం లేదని అర్థం వస్తుందని అన్నారు.
పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేయాలని ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా, రజిత, సిరిసిల్ల, వేములవాడ ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు పెంచలయ్య, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ద్దీన్, ఎం.పి.ఓ. లు, పంచాయతీ కార్యదర్శులు, ఏ.ఎన్.ఎం. లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.