సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జిల్లా స్థాయి సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు జరిగాయి. ఈ ఎంపిక పోటీలను పాఠశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్, మంచిర్యాల జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి కిరణ్ గారు, PET జగతి ఆదిత్ కుమార్, సీనియర్ క్రీడాకారులు జీషాన్, అంజి, అలాగే SI రాజశేఖర్ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ మాట్లాడుతూ, గత సంవత్సరం కూడా తమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సాఫ్ట్‌బాల్‌లో జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మంచి మానసిక స్థితి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం జట్టు భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. అధికారులు, ఉపాధ్యాయులు, కోచ్‌లు సీనియర్ క్రీడాకారులు విద్యార్థులను అభినందించారు.






