30 August, 2026 | 8:57 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఎల్లమ్మ తల్లి చల్లని చూపు జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి

30-08-2026 07:49 PM

పండుగలు ఐకమత్యానికి హేతువులు

జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య

జవహర్ నగర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఎల్లమ్మ తల్లి దీవెనలు జవహర్ నగర్ ప్రజలందరిపై ఉండాలని, పండుగలు ఐక్యమత్యానికి హేతువులని జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పాపయ్య నగర్ లో శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం, బోనాల పండుగ  వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య హాజరై అమ్మవార్లకు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ, ఎల్లమ్మ తల్లి దీవెనలు జవహర్ నగర్ ప్రజలపై ఉండి అమ్మవారి కరుణాకటాక్షాలతో జవహర్ నగరే కాక తెలంగాణ యావత్తు పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.

తెలంగాణలో అతిపెద్ద పండుగ బోనాల పండగేనని ఈ పండుగ ఐక్యమత్యానికి చిహ్నాలు అన్నారు. అనంతరం రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకులు మేకల భార్గవ రామ్, పాపయ్య నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.