విద్యార్థులకు సైక్లింగ్ పోటీ
30-08-2026 07:44 PM
సుల్తానాబాద్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): హాకీ మాంత్రికుడు హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినోత్సవ సందర్భంగా మూడు రోజుల సుల్తానాబాద్ ఖేలో ఇండియా ఖో ఖో సెంటర్ సుల్తానాబాద్ నిర్వాహకుడు జాతీయ క్రీడాకారులు గెల్లు మధుకర్ యాదవ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా ఆదివారం విద్యార్థులకు సైక్లింగ్ పోటీ నిర్వహించడం జరిగింది , ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ పేట అధ్యక్షులు అంతటి శంకరయ్య ప్రారంభించారు, మాజీ వార్డు మెంబర్ అమీరిశెట్టి తిరుపతి ,పిటిలు ఆరేపల్లి వెంకటేష్, రాటె రాకేష్, సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కొలిపాక రవీందర్ , పోడేటి వెంకటేష్, ఉల్లంగుల శ్రీనివాస్, పెగడ పరుశురాములు, సుల్తానాబాద్ క్రీడాకారులు పాల్గొన్నారు..






